Skip to playerSkip to main contentSkip to footer
  • 8 years ago
Sai Dharam Tej "Inttelligent" movie review. Intelligent produced by C. Kalyan on CK Entertainments banner and directed by V. V. Vinayak. Starring Sai Dharam Tej, Lavanya Tripathi in the lead roles.

మెగా డైరెక్టర్ వివి వినాయక్, మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్.... ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన 'ఇంటిలిజెంట్' సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ముందు నుండి మంచి అంచనాలు ఉన్నాయి. వరుస ప్లాపులతో ఉన్న సాయి ధరమ్ తేజ్‌ను వినాయక్ తన కమర్షియల్ ఫార్ములాతో హిట్ బాట పట్టిస్తాడని అంతా నమ్మకంగా ఎదురు చూశారు. గతంలో నాయక్, తులసి, లక్ష్మి లాంటి హిట్ చిత్రాలకు కథ అందించిన ఆకుల శివ ఈ చిత్రానికి కథ సమకూర్చడంతో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి కారణమైంది. మరి ఈ సనిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించింది అనేది సమీక్షలో చూద్దాం....
నంద కిషోర్ (నాజర్) ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ రన్ చేస్తూ టెక్నాలజీ ఉపయోగించి పేద ప్రజలకు సహాయం అందేలా చేయడంతో పాటు, తనూ నలుగురికి సహాయం చేస్తుంటాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సాయి ధరమ్ తేజ్‌ టాలెంట్ గ్రహించిన నందకిషోర్ తన ఖర్చుతో మన హీరోను చదవిస్తాడు. పెరిగి పెద్దయి సాఫ్ట్‌వేర్ ఇంజనీరైన హీరో బయటి కంపెనీల్లో పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నా లెక్కచేయకుండా నందకిషోర్‌కు చేదోడువాదోడుగా ఉంటూ నలుగురికీ సహాయం చేయడంలోనే ఆనందం వెతుక్కుంటూ ఉంటాడు. అంతా సవ్యంగా జరిగితే సినిమా ఎలా అవుతుంది?... సీన్లోకి విలన్ విక్కీ భాయ్(రాహుల్ దేవ్) ఎంటరవుతాడు. కంపెనీ తన పేరున రాయాలని బెదిరిస్తాడు. వినక పోవడంతో నందకిషోన్‌ను చంపేసి కంపెనీ తన పేరున రాయించుకుంటాడు. తాను ఇంతటివాడిని కావడానికి కారణమైన బాస్‌ను చంపిన వారిపై హీరో ఎలా రివేంజ్ తీసుకున్నాడు? అనేది మిగతా కథ.
ఆకుల శివ అందించిన స్టోరీ పరమ రోటీన్‌గా ఉంది. సాదా సీదా రివేంజ్ డ్రామా చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. వెతుకుదామన్నా సినిమాలో ఒక్క ట్విస్ట్ కూడా కనిపించదు. దీనితోడు లాజీక్ లేని సీన్లు కూడా ప్రేక్షకులకు బోర్ తెప్పిస్తాయి.

Recommended