Vishnu Manchu interview about Gayatri movie

  • 6 years ago
Vishnu Manchu is gearing up to hit the screens this feb 9th with Gayatri. Vishnu appears as young Mohan Babu in the movie. He is so confident on that character.

'దూసుకెళ్తా..' తర్వాత మంచు విష్ణు కెరీర్‌లో సరైన హిట్టు లేదు. మధ్యలో 'పాండవులు పాండవులు తమ్మెద' తప్ప వచ్చిన సినిమాలు వచ్చినట్లే పోయాయి. ఇప్పుడు తన ఆశలన్నీ 'గాయత్రి', 'ఆచారి అమెరికా యాత్ర'ల పైనే. 'గాయత్రి'లో మోహన్ బాబు యుక్తవయసు పాత్రలో కనిపించబోతున్న విష్ణు.. సినిమాలో తన పాత్ర కచ్చితంగా ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నాడు. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో.. ఇక తాను నటనకు పనికొస్తానా?.. లేదా?.. అన్నది తేలిపోతుందని ఓ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేశాడు..
నటుడిగా నేనేంటో నిరూపించుకునే చిత్రమిది. నటనకు పనికివస్తానా? లేదా? అన్నది ఈ సినిమాతో డిసైడ్ అయిపోతుంది. నేను చేసిన క్యారెక్టర్‌పై నమ్మకంతోనే ఈ మాట చెబుతున్నా. సినిమాలో నేను కనిపించేది 15 నిమిషాలే అయినా కథను నా పాత్ర ప్రభావితం చేస్తుంది. నటుడిగా నాకు మర్యాదను తీసుకొచ్చే సినిమా ఇది.
ఒకే ఇమేజ్‌లో ఇరుక్కుపోకుండా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉండే పాత్రల్లో చేయాలనుకుంటున్నా. సినిమా అంతా ఒకే తీవ్రతతో కూడిన పాత్రలో నటించాలనే కోరిక 'అనుక్షణం'తో తీరింది. ఇప్పుడు మళ్లీ 'గాయత్రి'తో నాలోని నటుడికి సవాల్ విసిరే పాత్ర దొరికింది.
'గాయత్రి'లో నాన్న రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఒకటి పూర్తి పాజిటివ్ కోణంలో సాగితే.. మరొకటి ప్రతినాయక ఛాయలతో నెగటివ్ గా సాగుతుంది. రెండూ వేటికవే భిన్నంగా ఉంటాయి. ఇక నా విషయానికొస్తే.. నాన్న పాత్రలో కనిపించడానికి ఆయన బాడీలాంగ్వేజ్, హావభావాలను అనుకరించకుండా నా శైలిలో నటించాను. ఆయన స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. భయాలేవి పెట్టుకోకుండా నటించాను.

Recommended