BJP Plans To Join Hands With Jagan, Ignoring Chandrababu

  • 6 years ago
Naidu reviewed the Budget with some senior ministers and also held a teleconference with party MPs, he said. All the party leaders expressed "serious displeasure" over the Union Budget as it "gave nothing" to the state. and Telugu Desam party (TDP) feels that BJP is in bid to make Andhra Pradesh CM weak.

మిత్రపక్షాలను లొంగదీసుకునే వ్యూహంలో భాగంగానే బిజెపి తనపై కూడా ప్రయోగం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో కాంగ్రెసు అనుసరించిన వ్యూహాన్నే బిజెపి కూడా మిత్రపక్షాల పట్ల అనుసరిస్తోందని ఆయన అనుకుంటున్నారు. బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యవహారశైలిని, బిజెపి జాతీయ నాయకత్వం మౌనాన్ని పరిగణనలోకి తీసుకుని తెలుగుదేశం పార్టీ బిజెపి వ్యూహాన్ని అంచనా కట్టే ప్రయత్నం చేస్తోంది.
తమను అణచివేసి, తమ రాజకీయ ప్రత్యర్థి అయిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని బిజెపి పరోక్షంగా ప్రోత్సహిస్తోందనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబునే కాకుండా జగన్‌ను కూడా తమ గుప్పిట్లో ఉంచుకునే ద్విముఖ వ్యూహాన్ని బిజెపి అనుసరిస్తోందని తెలుగుదేశం పార్టీ అనుమానిస్తోంది
బిజెపి వ్యూహంపై తెలుగుదేశం పార్టీలో సీరియస్‌గా చర్చ జరుగుతోంది. చంద్రబాబును దెబ్బ తీయడం, జగన్‌ను ప్రోత్సహించడం ద్వారా ద్విముఖ వ్యూహాన్ని అనుసరించి వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారితో కలిసి నడిచే విధంగా బిజెపి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు.
రాష్ట్రానికి అన్యాయం చేసినప్పటికీ మౌనంగా ఉంటే దాన్ని బిజెపి బలహీనతగా తీసుకుని తన వ్యూహానికి బిజెపి పదును పెడుతోందని తెలుగుదేశం పార్ీ నాయకులు భావిస్తున్నారు. తమ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎక్కువ పార్లమెంటు సీట్లు రాకుండా దెబ్బ తీయాలని చూస్తోందని, రాష్ట్రానికి ఏమీ ఇవ్వకపోయినా మౌనంగా ఉంటే ప్రజలు తమనే తప్పు పడుతారు కాబట్టి వైసిపి ప్రయోజనం పొందుతుందని, బిజెపికి కావాల్సింది అదేనని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు.

Recommended