Skip to playerSkip to main contentSkip to footer
  • 2/3/2018
Aamir Khan posted like this : Yes, that’s a Pad in my hand & there's nothing to be ashamed about. It's natural! Period. PadManChallenge. Copy, Paste this & Challenge your friends to take a photo with a Pad. Here I am Challenging @SrBachchan , @iamsrk & @BeingSalmanKhan

ఒక పాపులర్ తెలుగు సినిమాలో.. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థిని స్కర్టుపై కొంతమంది ఆకతాయిలు రెడ్ ఇంక్ చల్లి శునకానందం పొందుతారు. ఆకతాయిల చర్యకు విద్యార్థిని తలదించుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
నిజానికి శునకానందం పొందిన ఆ ఆకతాయిల కన్నా.. అలాంటి సీన్ పెట్టినందుకు దర్శకుడే సిగ్గుపడాలేమో!.. 'రుతుస్రావం' అనే సెన్సిటివ్ అంశాన్ని పురుషులు నవ్వుకునే ఓ జోక్ లాగా.. 'స్త్రీ'లు అవమానంగా ఫీలయ్యే విషయంలాగా చిత్రీకరించినందుకు. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన సినిమా ఒకటి రాబోతోంది.. అదే 'ప్యాడ్ మ్యాన్'
చుట్టూ నలుగురున్న చోట 'నెలసరి' సమస్య గురించి మాట్లాడటమే మనదేశంలో పెద్ద సాహసం. ఇప్పటికీ ఆ సమస్యలపై నోరు విప్పడానికి చాలామంది మహిళలకు బిడియం అడ్డువస్తుంది. అంతకుమించి అదో మాట్లాడకూడని విషయం లాగే చూస్తారు. దీన్ని బద్దలు కొట్టిన అరుణాచలం మురుగనాథం జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమే 'ప్యాడ్ మ్యాన్'.
ప్యాడ్ మ్యాన్' చిత్రం ద్వారా మహిళల్లో.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళల్లో 'రుతుస్రావం'పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్వింకిల్ ఖన్నా విసిరిన 'ప్యాడ్‌మ్యాన్' ఛాలెంజ్‌ను ఆమీర్ ఖాన్ స్వీకరించారు. శానిటరీ నాప్‌కిన్‌ చేతిలో పట్టుకుని తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు.

Recommended