IPL 2018 : Delhi Daredevils squad analysis

  • 6 years ago
The bowling line-up for Delhi Daredevils is looking strong with the franchise retaining South Africa seamer Kagiso Rabada for Rs 4.2 crore and Indian fast bowler Mohammed Shami for Rs 3 crore. Delhi also had retained Chris Morris in the squad, which further boosts their seam bowling. India U-19 captain Prithvi Shaw could prove to be a smart buy for Delhi Daredevils this season

ఐపీఎల్ వేలం ముగిసింది. బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 22 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వేలానికి ముందు ఆ జట్టు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్‌ను గెలవని ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఐపీఎల్ 11వ సీజన్‌లో టైటిలే లక్ష్యంగా యువ ఆటగాళ్లకు వేలంలో పెద్ద పీట వేసింది. వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కొనుగోలు చేసిన ఆటగాళ్లలో ఎక్కువ మంది యువ క్రికెటర్లు ఉండటం విశేషం.
ఐపీఎల్ 11వ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ వ్యవహారిస్తున్నారు. వేలం జరిగిన రెండు రోజులు పాంటింగ్ దగ్గరుండి మరీ ఆటగాళ్లను కొనుగోలు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుని రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిపిన టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతం గంభీర్‌ను ఈసారి ఢిల్లీ వేలంలో రూ. 2.8 కోట్లకు సొంతం చేసుకుంది.

Recommended