Skip to playerSkip to main contentSkip to footer
  • 8 years ago
Veteran Bollywood actress Zeenat Aman, who appeared in several notable films in the 70s and the 80s, has filed a molestation case against a businessman who was known to her family earlier.

ఒకప్పటి బాలీవుడ్ తార జీనత్ అమన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కారు. ఓ వ్యాపారవేత్త తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు వ్యాపారవేత్త ఆమె కుటుంబానికి బాగా పరిచయం ఉన్న వ్యక్తే కావడం గమనార్హం.
అమర్ ఖన్నా అనే వ్యాపారవేత్త గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని జీనత్ అమన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు.
జీనత్ అమన్ ఫిర్యాదు మేరకు సెక్షన్స్-304D, 509ల కింద ముంబై జుహు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అమర్ ఖన్నా పరారీలో ఉన్నట్లు గుర్తించారు.
జీనత్ అమన్ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అమర్ ఖన్నాతో జీనత్ అమన్ కు చాలాకాలంగా పరిచయం ఉందని, కొన్ని విభేదాల కారణంగా ఇద్దరి మధ్య సత్సంబంధాలు చెడిపోయానని తెలిపారు. అప్పటినుంచి జీనత్ అమన్ అమర్ ఖన్నాతో మాట్లాడటం మానేసిందన్నారు.
జీనత్ అమన్ తనతో మాట్లాడకపోతుండటంతో.. అమర్ ఖన్నా ఆమెను చాలారోజుల నుంచి ఫాలో అవుతున్నారని, పదేపదే ఫోన్ కాల్స్ చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అతని తీరులో మార్పు రాకపోవడంతోనే ఆమె తమను ఆశ్రయించిందని చెప్పారు.

Recommended