Post release of Sanjay Leela Bhansali's Padmaavat despite their protests, Shri Rajput Karni Sena on Thursday announced that they will produce a film on the director's mother, which will named as "Leela ki Leela".
వివాదాలే నడుమనే విడుదలైన 'పద్మావత్' హిట్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్‌లో 'వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్స్'గా ఈ సినిమా నిలిచిపోతుందన్న ప్రశంసలను కూడా దక్కించుకుంది. ఇక కర్ణిసేన ఆరోపిస్తున్నట్లు ఈ సినిమాలో 'పద్మావతి' పాత్రను ఎక్కడా అసభ్యంగా చూపించలేదని, అలాగే రాజ్‌పుత్‌ల గురించి గొప్పగా చెప్పారు తప్పితే ఎక్కడా వాళ్లను తక్కువ చేయలేదని చెబుతున్నారు. అయినా సరే, కర్ణిసేన మాత్రం శాంతించడం లేదు. నిన్న మొన్నటిదాకా దాడులతో వివాదాన్ని రాజేసిన కర్ణిసేన.. ఇప్పుడు భన్సాలీకి కౌంటర్‌గా సినిమా మొదలుపెడుతామని ప్రకటించడం గమనార్హం. 'పద్మావత్' చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తల్లి జీవితాధారంగా సినిమా తీస్తామని రాజస్థాన్‌కు చెందిన కర్ణిసేన ప్రకటించింది. తమ వాదనను, ఆందోళనను లెక్క చేయకుండా 'పద్మావత్'ను విడుదల చేసినందుకు ఆయన తల్లిపై సినిమా చేసి తీరుతామని ప్రకటించింది. దీనికి 'లీలా కీ లీలా' అనే టైటిల్ పెట్టబోతున్నామని కర్ణిసేన కార్యకర్తలు వెల్లడించారు. చిత్తోర్‌గఢ్ ప్రాంగణంలో కర్ణిసేన జిల్లా అధ్యక్షుడు గోవింద్ సింగ్ మీడియాతో సమావేశమైన సందర్భంగా ఈ వివరాలు వెల్లడించారు. మరో 15 రోజుల్లో సినిమా మొదలుపెట్టబోతున్నామని, అరవింద్ వ్యాస్ అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తాడని తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ అంతా రాజస్థాన్ లోనే జరుగుతుందని చెప్పారు. భన్సాలీ తమ తల్లి 'పద్మావతి'ని అవమానించాడు కాబట్టే.. ఇప్పుడు మేము ఆయన తల్లి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయబోతున్నామని కర్ణిసేన వెల్లడించింది.