Skip to playerSkip to main contentSkip to footer
  • 8 years ago
Padmaavat is Bhansali’s most ambitious project to date. The love story, the conflict, the dramatic altercations, the battle sequences and of course, the ostentatious setting… It is an enthralling period film that transports you to an era you had only read about in the history books.


వివాదాలన్నింటి నుంచి గట్టెక్కి ఎట్టకేలకు ఈ నెల 25న విడుదలకు సిద్దమైంది 'పద్మావత్' చిత్రం. అయినా ఎక్కడో ఏదో అనుమానం.. చివరి నిమిషంలో మళ్లీ ఎవరైనా అడ్డుపడుతారేమోనని!. సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా సినిమాలో చాలా సీన్లకు కత్తెర వేసినా.. కర్ణిసేన ఆగ్రహం మాత్రం చల్లారకపోవడంతో.. సినిమా విడుదల రోజు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. వివాదాల సంగతెలా ఉన్నా.. సినిమాకు సంబంధించి అప్పుడే రివ్యూ కూడా బయటకు రావడం విశేషం. ఇన్ని వివాదాలను తట్టుకుని విడుదలకు సిద్దమైన ఈ సినిమా అంచనాలను అందుకుందా?.. భన్సాలీ మరోసారి తన మార్క్ చూపించారా?.. మొత్తంగా సినిమా ఎలా ఉంది? అనే ప్రశ్నలకు సమాధానంగా బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు సంధించిన రివ్యూ ఇదీ..
ఒక ప్రేమ కథా.. అందులో చోటు చేసుకునే సంఘర్షణ, నాటకీయ పరిణామాలు, భీకర యుద్ద సన్నివేశాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను అత్యంతగా ఆకట్టుకోవడమే కాకుండా.. చరిత్రలోకి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. కేవలం పుస్తకాల్లో మాత్రమే చదువుకున్న కథను కళ్లముందు సజీవంగా ఆవిష్కరిస్తుంది.
తెరపై భన్సాలీ కథను నడిపించిన తీరు ప్రతీ ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంటుంది.
సినిమా చూస్తుంటే.. హాలీవుడ్ క్లాసికల్ చిత్రాల నుంచి భన్సాలీ స్ఫూర్తి పొందినట్లుగా స్పష్టమవుతోంది. అయితే 'పద్మావత్' కథను నెరేట్ చేయడంలో భన్సాలీ కనబర్చిన నేర్పు అధ్భుతం. పద్మావత్ సినిమా స్థాయిని పెంచడంలో భన్సాలీ కనబర్చిన ఈ నేర్పు స్పష్టంగా కనిపిస్తుంది.

Recommended