Skip to playerSkip to main contentSkip to footer
  • 8 years ago
The Supreme Court has rejected petitions seeking modification of the order which had lifted the ban on Padmaavat.

పద్మావత్ చిత్రానికి సుప్రీంలో ఊరట
ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలపాలైన పద్మావత్ సినిమాకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో మరోసారి మద్దతు లభించింది. సినిమా విడుదలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎట్టి పరిస్థితుల్లో మార్చమని చెప్పింది. మంగళవారం నాడు సుప్రీం కోర్టు మరోసారి అండగా నిలిచింది. సినిమా విడుదలను ఆపివేయాలంటూ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో జనవరి 25న పద్మావత్ విడుదల కానుంది. పద్మావత్ చిత్రం జనవరి 25న దేశవ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు భాషాల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పలు రాష్ర్టాల్లో పద్మావత్ సినిమా విడుదలను ఆపాలంటూ దాడులు జరుగుతున్నాయి. కొన్ని రాష్ర్టాలు ముందస్తుగానే ఆ సినిమాపై నిషేధం విధించాయి, పద్మావత్ సినిమా విడుదలను ఆపాలంటూ మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.
పద్మావత్ చిత్రాన్ని ప్రదర్శించలేమంటూ పిటిషన్ వేసిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది. ఆ బాధ్యతను నిర్వర్తించలేమని చేతులెత్తేయడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Category

🗞
News

Recommended