యాంకర్ ప్రదీప్‌కు శిక్ష ఖరారు.. కోర్టు తీర్పు ఇదే !

  • 6 years ago
Anchor Pradeep Driving Licence Cancelled for 3 Years and Rs 2100 Fine in Drunken Drive Case.

అతిగా మధ్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన టీవీ యాంకర్ ప్రదీప్‌‌కు శిక్ష ఖరారైంది. ఈ కేసులో నాంపల్లి కోర్టు శుక్రవారం తుది తీర్పు వెల్లడించింది. దీంతో గత 20 రోజులుగా జరుగుతున్న హడావుడికి తెరపడింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ మూడుళ్ల పాటు రద్దు చేయడంతో పాటు రూ. 2100 జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. జరిమానా విధించడానికి ప్రదీప్ ఒప్పుకున్నారు.
ప్రదీప్ మీద కేసు బుక్ అయిన రోజు నుండి..... అతడు సేవించిన మద్యం మొతాను బట్టి కనీసం వారం రోజులు జైలు శిక్షపడే అవకాశం ఉందంటూ కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమీ జరుగలేదు.
డిసెంబర్ 31వ తేదీ రాత్రి అతిగా మధ్యం సేవించి కారు నడపడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడంతో పాటు కారు సీజ్ చేశారు.
అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ అయిన తర్వాత కనిపించకుండా పోవడానికి షూటింగ్ కమిట్మెంట్సే కారణమని, తాను ఎక్కడికీ పారిపోలేదని, ‘లా' ప్రకారం ఫాలో అవుతున్నాను అని ప్రదీప్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Recommended