TDP senior leader and former minister Muthekepalli Narasimhulu suggested that to merge the TDP Telangana branch in TRS.
తెలంగాణ టిడిపి శాఖను టిఆర్ఎస్‌లో విలీనం చేయాలని టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టిడిపి అంతరించిపోయిందనే ప్రచారం కంటే ఇదే నయమని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ 22వ, వర్ధంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం నాడు మోత్కుపల్లి నర్సింహులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ 22వ, వర్ధంతి రోజున ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాకపోవడంపై మాజీ మంత్రి టిడిపి సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టిని బలోపేతం చేసే విషయమై మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబునాయుడుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల విషయమై మోత్కుపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో టిడిపి లేదు, అంతరించిపోయిందనే ప్రచారం సాగుతోంది. ఈ రకమైన ప్రచారంతో పార్టీ ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది,. ఈ తరుణంలో ఈ అవమానాలను భరించే కంటే టిఆర్ఎస్‌లో టిడిపిని విలీనం చేస్తే ప్రయోజనం ఉంటుందని మాజీ మంత్రి , టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు సూచించారు.014 ఎన్నికల్లో సుమారు 22 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లు వేసిన ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలంటే ఈ పనిచేయాలని మోత్కుపల్లి సూచించారు. టిఆర్ఎస్ మంత్రి వర్గంలో బాబు నాయకత్వంలో పనిచేసే నేతలే ఉన్నారని మోత్కుపల్లి సూచించారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు సహకరించే నేతలు ఎవరూ లేరని మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయపడ్డారు. పార్టీని బతికించుకొనేందుకు నేతలు ముందుకు రావడం లేదని మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రకమైన పరిస్థితుల కారణంగా తన లాంటి సీనియర్ నేతలంతా మానసిక సంఘర్షణకు గురౌతున్నట్టు నర్సింహులు చెప్పారు.