త్రివిక్రమ్ 'మిస్ ఫైర్'.. అలా జరిగి ఉంటే పవన్ సేఫ్ అయ్యేవాడు..!

  • 6 years ago
Everybody knows that Trivikram has taken the main plot of 'Agnyaathavaasi' from the French film 'The Heir Apparent: Largo Winch'. Surprisingly, it is not just Trivikram who eyed on the French actioner.

కాపీ కథల్ని తెరకెక్కించడంలో మన దర్శకులు ఎంతటి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో ఇటీవలి కాలంలో ప్రేక్షకులు గమనిస్తూనే ఉన్నారు. తీరా దొరికిపోయాక.. కాపీ కథ కాదు ఏదో స్ఫూర్తి పొందామని కవర్ చేసుకుంటారు. కానీ సీన్ అప్పటికే జనాలకు అర్థమైపోతుంది.
ఇంతకీ విషయమేంటంటే.. కాపీ కంటెంట్‌తో ఒక అపప్రదను మూటగట్టుకున్నారు త్రివిక్రమ్. 'అజ్ఞాతవాసి'తో కాపీ వివాదం తెర పైకి రాగా.. ఆయన గత చిత్రాల అసలు మూలాలు కూడా హాలీవుడ్ లో ఉన్నాయన్న విమర్శలు ఎక్కువయ్యాయి. నిజానికి 'అజ్ఞాతవాసి' లాంటి సినిమాను గతంలోనే మరో దర్శకుడు తెరకెక్కించే ప్రయత్నం చేశాడన్న వార్త ఇప్పుడు తెరపైకి వచ్చింది.
తమిళ హీరో విజయ్‌తో దర్శకుడు గౌతమ్ మీనన్ అప్పట్లో ఓ ప్రాజెక్ట్ ప్రకటించారు. 'యోహన్-అధ్యాయం ఒండ్రు' అనే టైటిల్‌తో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అసలు విషయమేంటంటే.. ఇప్పుడు త్రివిక్రమ్ ఏ సినిమాను కాపీ కొట్టాడని విమర్శలు ఎదుర్కొంటున్నారో.. అదే సినిమా(లార్గో వించ్) స్ఫూర్తిగా సినిమా తీద్దామనుకున్నాడట గౌతమ్ మీనన్.
స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసుకుని.. ఇక ప్రాజెక్ట్ పట్టాలెక్కడమే ఆలస్యం అనుకున్న తరుణంలో గౌతమ్ మీనన్-విజయ్ ల సినిమా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందనే దానిపై ఎటువంటి క్లారిటీ లేదు. బహుశా.. 'లార్గో వించ్' లైన్‌తో సినిమా చేస్తున్నామని తెలిస్తే.. కాపీ రైట్ సమస్యలు వస్తాయని ముందే ఊహించారేమో?
అయితే 'లార్గో వించ్' లైన్ తో గౌతమ్ మీనన్ గనుక సినిమా తీసి ఉంటే త్రివిక్రమ్‌లా కాకుండా మంచి ట్రీట్‌మెంట్‌తో తీసి ఉండేవాడేమో అన్న టాక్ కూడా ఉంది. మొత్తంగా గౌతమ్ ఈ సినిమాను మిస్ అయితే.. త్రివిక్రమ్ దాన్ని 'మిస్ ఫైర్' చేశాడనే చెప్పాలి.

Recommended