Kangana Ranaut & controversies go hand in hand. Just when we thought that Kangana & Karan, who was yesterday, spotted together on the sets of India's Next Superstar, will mend their ways, Kangana ended up taking a yet another major dig at KJo! According to Spotboye, it all happened when the duo played the 'How well do you know each other?" game during the shoot.
బాలీవుడ్ అందాల భామ కంగనా రనౌత్, దర్శకుడు కరణ్ జోహర్ మధ్య ఒకప్పుడు పచ్చ గడ్డి వస్తే భగ్గుమనేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ మధ్య ఇండియాస్ నెక్ట్స్ సూపర్‌స్టార్ అనే టెలివిజన్ షో షూటింగ్ సందర్భంగా వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపించడం చర్చనీయాంశమైంది. వారి మధ్య ఉన్న వివాదాలను దూరం పెట్టినట్టు కనిపించిందట. ఇండియాస్ నెక్ట్స్ సూపర్‌స్టార్ సెట్లో కరణ్, కంగన ఒకరిపై మరొకరు జోకులు, సెటైర్లు వేసుకుంటూ చాలా ఆనందంగా గడిపారు అని సెట్ నిర్వాహకులు కథనం. ఈ గేమ్ షూట్ సందర్భంగా అతిథులకు స్వయంగా కరణ్ వడ్డించారట. అలా వడ్డించేటప్పుడు వెనుక నుంచి కరణ్ మీకు విషం తాగిస్తాడు జాగ్రత్త అని కంగన ఓ కామెంట్ విసిరిందట. దాంతో కరణ్ ఒక్కసారిగా షాక్ అయి చూడగానే కంగన రనౌత్ నవ్వుతూ కనిపించిందట. బాలీవుడ్‌లో బంధుప్రీతిపై కంగన రనౌత్ కామెంట్స్ చేయడం వివాదామైన సంగతి తెలిసిందే. అలాగే కరణ్ జోహర్‌కు బంధుప్రీతి ఎక్కువ అని కంగన ఓ దశలో విరుచుకుపడింది. దాంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది.