Skip to playerSkip to main contentSkip to footer
  • 8 years ago
సాధారణంగా పండుగ ఉత్సవాలు అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేవి పిండి వంటకాలు అందులోనూ యమ్మీ యమ్మీ స్వీట్స్. మన భారతీయులందరూ ప్రత్యేకంగా మరియు తప్పకుండా తయారుచేసుకునే సాంప్రదాయ వంటకం బాదుషా. ఉత్తర భారతదేశంలో ఈ బాదుషా నే బాలుషాహి అని పిలుస్తారు. ఈ బాదాషా మైదా పిండి, పెరుగు, నెయ్యి మరియు చిటికెడు బేకింగ్ సోడా వంటి పదార్థాలతో తయారుచేస్తారు. బాదుషా లేదా బాలుషాహి బయట క్రిస్పీ గా మరియు లోపల మెత్తగా వుంటూ నోట్లో పెట్టుకోగానే మెల్లగా కరిగిపోతుంది. పిండివంటకంతో తయారుచేసి నూనెలో వేయించిన మరియు బయట చక్కెర పాకులో ముంచిన బయటి భాగం మీ నోటి ని తియ్యగా చేస్తుంది. బాదుషా ని తయారుచేయడం చాలా చాలా సులభం. ఇక్కడ అన్ని పదార్థాలను సరైన క్వాంటిటీ లో కలపడం కాస్త కష్టతరమైన పని. ఒక క్రిస్ప్ మరియు మెత్తటి బాదుషా ని పొందడానికి, సరైన భాగంలో కలపడం ఖచ్చితంగా తెలుసుండాలి. అలాగని తెలిసిఉంటే ఈ రెసిపీ ని చేయడానికి చెఫ్ లు అయుండాల్సిన పనిలేదు. సో, మీరు ఈ వంటకాన్ని మీఇంట్లోనే ప్రయత్నిచాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీరు కూడా ప్రయత్నించండి.

Recommended