Skip to playerSkip to main content
  • 8 years ago
According to reports - Tollywood celebrities with clean records have been roped in by Hyderabad police to be a part of short films to campaign against crimes.

సినీ ప్రముఖులతో హైదరాబాద్ పోలీసులు ప్రయోగం చేస్తున్నారు. నేరాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రణాళికలో భాగంగా వారు క్లీన్ ఇమేజ్ ఉన్న సినీ ప్రముఖులను ఎంపిక చేసుకుని ఆ ప్రయోగం చేస్తున్నారు. నేరాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రణాళికలో భాగంగా హైదరాబాదులో పోలీసులు లఘు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ లఘు చిత్రాలను థియేటర్లలో ప్రదర్శించడానికి కేంద్ర ఫిల్మ్ సర్టిపికేషన్ బోర్డు (సిబిఎఫ్‌సి) అనుమతి ఇచ్చింది.
క్లీన్ ఇమేజ్ ఉన్న సినీ ప్రముఖులతో ఇప్పటి వరకు హైదరాబాదు పోలీసులు ఐదు లఘు చిత్రాలను నిర్మించినట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఓ అంగ్ల మీడియా వార్తాకథనాన్ని ప్రచురించింది. ఈ ఐదు చిత్రాలను కూడా సిబిఎఫ్‌సి క్లియర్ చేసింది.
నేరాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి నిర్మించిన లఘు చిత్రంలో హైదరాబాద్ పోలీసులు ఎన్టీఆర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్రాడ్, సోషల్ మీడియా క్రైమ్, జాబ్ ఫ్రాడ్స్ తదితర నేరాలకు వ్యతిరేకంగా లఘు చిత్రాల ద్వారా ప్రచారం చేస్తారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended