The much awaited movie Agnyaathavaasi all set to release on Jan 10th, recently a speculation circulating in fans circle about Pawan's naem in movie.
'అజ్ఞాతవాసి' కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. విడుదల దగ్గరపడుతున్న కొద్ది బయటకొస్తున్న లీక్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. మొదటి ఆటకే సినిమా చూసేయాలన్న ఆత్రుత అభిమానులకు నిద్రను కూడా దూరం చేస్తోంది. అంతలా 'అజ్ఞాతవాసి' కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర ఊహాగానం బయలుదేరడం.. వారిలో క్యురియాసిటీని రెట్టింపు చేస్తోంది. తనతో చేసిన రెండు సినిమాల్లోనూ పవన్ క్యారెక్టర్ ను డిఫరెంట్ నేమ్స్ తో పరిచయం చేశాడు దర్శకుడు త్రివిక్రమ్. అదే 'జల్సా'లో సంజయ్ సాహు.. 'అత్తారింటికి దారేది'లో గౌతమ్ నందా పేర్లతో హీరో క్యారెక్టర్ ను పరిచయం చేసిన ఆయన.. ఇప్పుడు కూడా మరో సరికొత్త పేరుతో పవన్ పాత్రను పరిచయం చేయబోతున్నాడట. ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్న ఊహాగానాల ప్రకారం.. 'అజ్ఞాతవాసి'లో పవన్ పాత్ర పేరు 'అభిషిక్త్ భార్గవ' అని టాక్. 'ఏబీ.. ఎవరో నీ బేబీ' అంటూ సాగే పాటను గమనిస్తే హీరో పాత్ర 'ఏబీ'తో లింకప్ అయి ఉందని అర్థమవుతుంది. ఆ షార్ట్ కట్ కు ఫుల్ ఫామ్ అభిషక్త్ భార్గవ అని అంటున్నారు. 'అజ్ఞాతవాసి'లోని కొన్ని పాటల్లోనూ 'భార్గవ' అనే పదం అక్కడక్కడా వినిపిస్తూనే ఉంది. దీన్నిబట్టి ఏబీకి అబ్రివేషన్ 'అభిషక్త్ భార్గవ' అని ఫిక్స్ అయిపోయారట. సినిమాలో పవన్ సహోద్యోగులు కూడా ఆయన్ను 'ఏబీ' అని పిలుస్తుంటారట.