రోమాలు నిక్కబొడుచుకునే కథతో.. అర్జున్ రెడ్డి దర్శకుడు !

  • 6 years ago
Sandeep Vanga is all set to make his next film. Reports saying that now Sandeep may comes up with a crime drama.
సీట్లో కూర్చొన్న ప్రేక్షకుడిని స్క్రీన్‌ నుంచి డీవియేట్ అవకుండా కథ చెప్పగలగడం కొంతమంది దర్శకులకే సాధ్యం. 'అర్జున్ రెడ్డి' సినిమాతో తనలో ఆ క్వాలిటీ ఉందని నిరూపించుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండ క్యారెక్టరేషన్‌తో ఆన్ స్క్రీన్ అద్భుతమైన పాత్రను పరిచయం చేసిన ఆయన.. తదుపరి చిత్రంలో ఎలాంటి కథను, పాత్రలను పరిచయం చేయబోతున్నారన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రంపై ఆసక్తికర ఊహాగానాలు బయలుదేరాయి..
'అర్జున్ రెడ్డి' లాంటి ఇండస్ట్రీని షేక్ చేసిన హిట్ తర్వాత ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలన్న దానిపై సందీప్ రెడ్డి వంగా చాలానే తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే సిద్దం చేసుకున్న కథలు ఉన్నప్పటికీ.. వాటిల్లో ఏది బెస్ట్ ఛాయిస్ అనేది తేల్చుకోలేకపోతున్నారు.
అర్జున్ రెడ్డి బంపర్ హిట్ తర్వాత.. సందీప్ వంగా షుగర్ ఫ్యాక్టరీ అనే క్రైమ్ డ్రామా తెరకెక్కించబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే దానిపై సందీప్ నుంచి మాత్రం ఎటువంటి క్లారిటీ రాలేదు. లేటెస్ట్ బజ్ ప్రకారం.. సందీప్ ఆ కథకే ఫిక్స్ అయ్యాడన్న టాక్ వినిపిస్తోంది.
'అర్జున్ రెడ్డి'లో హీరో పాత్రను ఎంత తీవ్రతతో చూపించాడో.. అంతే స్థాయి తీవ్రత ఉన్న క్రైమ్ కథను సిద్దం చేసుకున్నాడట సందీప్. రోమాలు నిక్కబొడుచుకునే రేంజ్‌లో ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయట. ఈ కథకు సంబంధించి ఇప్పటికే సందీప్ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

Recommended