Skip to playerSkip to main contentSkip to footer
  • 12/31/2017
Kamal tweeted, "I congratulate my brother Rajini for his social consciousness and his political entry. Welcome welcome." Like Rajinikanth, Kamal Haasan too has spoken about his entry into politics.
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రంపై విలక్షణ నటుడు కమల్ హాసన్ ఆదివారం స్పందించారు. ఆయన తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమైనదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వచ్చిన నా సోదరుడికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నానని వ్యాఖ్యానించారు. సమాజం పట్ల అతనికి ఉన్న బాధ్యత, రాజకీయ ఆరంగేట్రానికి కంగ్రాట్స్ తెలిపారు. స్వాగతం.. స్వాగతం అని పేర్కొన్నారు.

కాగా, రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం నేపథ్యంలో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని బీజేపీ స్వాగతించింది.
అయితే రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం పై ఒక్కోక్కరు ఒక్కో అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రజనీకాంత్ చదువు రానివాడు అని సుబ్రహ్మణ్యస్వామి విమర్శలు గుప్పించారు. చదువు సంధ్య లేని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. అయితే కమల్ మాత్రం సానుకూలంగా స్పందించారు.

కాగా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు కమల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ కమల్ పార్టీ పేరును ప్రకటించలేదు. రజినీ కూడా రాజకీయాల్లోకి వస్తానని చెప్పారే తప్ప, పార్టీ పేరును కానీ.. ఎప్పుడు పార్టీ పెడుతున్న విషయంపై గానీ స్పష్టత ఇవ్వలేదు.

Category

🗞
News

Recommended