మోసం చేశాడు.. ప్రముఖ దర్శకుడిపై హీరోయిన్ !

  • 6 years ago
Manisha Yadav did an item number for 'Chennai 600028 part 2'. She essayed the role of 'Soppana Sundari' in that item song. Now, she opened up about that item song and said, "Venkat Prabhu deceived me and made me dance in that cheap song. Venkat Prabhu sir just said this song will be the turning point in the movie. I trusted him and he misused my trust. I have high hopes for my next project."


సినిమాల్లో స్పెషల్ సాంగులు ఉండటం సర్వసాధారణం. ఒకప్పుడు వీటిని ఐటం సాంగ్స్ అనేవారు.. ఈ మధ్య కాలంలో పలువురు టాప్ హీయిన్లు ఇలాంటి సాంగ్స్‌లో నటిస్తుండటంతో స్పెషల్ సాంగ్స్ అని పిలుస్తున్నారు. ఐటం సాంగులతో పోలిస్తే స్పెషల్ సాంగ్స్‌లో వల్గారిటీ లెవల్స్ కాస్త తక్కువగానే ఉంటుందని చెప్పాలి. తాజాగా ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన హీరోయిన్... సినిమా విడుదలైన తర్వాత దర్శకుడిని బ్లేమ్ చేయడం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
ఇటీవల తమిళంలో విడుదలైన ‘చెన్నై 600028 పార్ట్ 2' చిత్రంలో హీరోయిన్ మనీసా యాదవ్ సోపన్న సుందరి అనే పాత్రను పోషించింది. ఈ చిత్రంలో ఆమెపై ఓ స్పెషల్ సాంగ్ కూడా చిత్రీకరించారు. అయితే ఆమె చేసిన సాంగ్ చాలా వల్గర్‌గా ఉందనే విమర్శలు రావడంతో..... డైరెక్టర్‌ వెంకట్ ప్రభును తిట్టిపోసే పని పెట్టుకుంది.
ఈ సినిమాకు తాను సైన్ చేసే సమయంలో దర్శకుడు, నిర్మాత స్పెషల్ సాంగ్ అని చెప్పారని.... సినిమా విడుదలైన తర్వాత చూస్తే నన్ను ఐటం గర్ల్‌గా చూపించారని, ఈ విషయంలో దర్శకుడు వెంకట్ ప్రభును తనను మోసం చేశారని మనీషా యాదవ్ ఆరోపించారు.

Recommended