President Ram Nath Kovind inaugurated the 100th Indian Economic Association (IEA) summit today held at Acharya Nagarjuna University (ANU) at Namburu in Guntur district
ఆచార్య నాగార్జునా యూనివర్శిటీలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ శతాబ్ది వేడుకలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జ్యోతీ ప్రజ్వలనం చేసి ప్రారంభించారు.
సీఎం చంద్రబాబుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పొగడ్తలు కురిపించారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. వెనుకబడిన వర్గాలను ఆదుకునేలా ఆర్థిక విధానాలు ఉండాలని, సామాజిక భద్రత ఉండేలా ప్రభుత్వ పాలసీలుండాలని కోవింద్ సూచించారు. ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ శతాబ్ధి ఉత్సావాలను రాష్ట్రపతి ప్రారంభించిన అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. పేదరికం నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి కోవింద్ అని చంద్రబాబు కొనియాడారు.
భారతదేశంలో యువ జనాభా ఎక్కువగా ఉందని, 2020 నాటికి దేశంలో మూడో స్థానంలో ఏపీని నిలుపుతామని బాబు స్పష్టం చేశారు. 2017 సంవత్సరంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు బీజం పడిందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు ఈ ఏడాదిలోనే జరిగాయని, భవిష్యత్తులో భారతదేశం ఆర్థికాభివృద్ధిలో దూసుకెళ్తుందని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు చెప్పారు.
ఎన్నో కష్టాలున్నా రాష్ట్రంలో రెండంకెల వృద్ది సాధిస్తున్నామన్నారు. ఏపీ తలసరి ఆదాయం ఇంకా పెరిగేలా ఈ సదస్సు ద్వారా సూచనలు చేయాల్సిందిగా ఆర్థిక నిపుణులను కోరుతున్నానని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.