SS Rajamouli name listed in Forbes Magazine 100 peoples wealth list. His name list at 15 place in Forbes Magazine list. In this occassion, People of Godavari districts felt happy and shares their happiness for the Rajamouli's feat.
బాహుబలి చిత్రంతో దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. దేశ సినీ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డులు సృష్టించిన చిత్రాన్ని సినీ ప్రేక్షకులు అందించారు. వినోదరంగంలో అత్యధికంగా సంపాదనను సొంతం చేసుకొన్న వ్యక్తిగా ఫోర్బ్స్ మ్యాగజైన్ పరిగణించింది. తాజాగా ప్రకటించిన 100 మంది జాబితాలో రాజమౌళికి 15వ స్థానం దక్కింది. ఈ సందర్బంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ఆయన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ప్రముఖ దినపత్రికతో తమ ఆనందాన్ని పంచుకొన్నారు. రాజమౌళి విద్యాభ్యాసం 1973లో కొవ్వూరులో జరిగింది. కొవ్వూరుకు చెందిన ఆయన సినీ రంగంలో అగ్ర దర్శకుడిగా గుర్తింపు పొందడంపై గోదావరి జిల్లా వాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా తమ అభిప్రాయాలను పంచుకొన్నారు.