Skip to playerSkip to main contentSkip to footer
  • 12/22/2017
హాలీవుడ్ సూపర్‌స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్‌ లైంగిక దాడి వివాదంలో ఇరుక్కుపోయాడు. 1990లో తనను శాంటా మోనికాలోని తన కార్యాలయంలో సిల్వెస్టర్ స్టాలోన్ తనపై అత్యాచారం జరిపాడు అని ఓ మహిళ ఫిర్యాదు చేయడం హాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. మహిళ ఫిర్యాదు మేరకు కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ చేసిన ఆరోపణలను సిల్వస్టర్ స్టాలోన్‌ తరఫు న్యాయవాది మార్టీ సింగర్ ఖండించారు. మహిళ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆమెకు వ్యతిరేకంగా మరో ఫిర్యాదును ఫైల్ చేయబోతున్నాం అని సింగర్ వివరణ ఇచ్చారు.
ఇదిలా ఉండగా, గతనెల సిల్వెస్టర్ స్టాలోన్‌పై మరో మహిళ అత్యాచారం ఆరోపణలు చేసింది. 1986లో స్టాలోన్‌తోపాటు మరో వ్యక్తి తనపై అత్యాచారం చేశారు అని సదరు మహిళ వెల్లడించారు. తనను భయపెట్టి స్టాలోన్, ఆయన బాడీగార్డ్ మైఖేల్ డీ లుకా ఓ హోటల్‌లో తనపై ఏకకాలంలో అత్యాచారం చేశారు అని ఓ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు.
సిల్వెస్టర్ స్టాలోన్‌తో జరిగిన శృంగారం ఓ కాళరాత్రిగా మిగిలింది.

Category

🗞
News

Recommended