హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు మంగళవారం నాడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్టాల నుంచి, జిల్లాల నుంచి హాజరైన భాషాభిమానులను పలకరించినప్పుడు వారి స్పందన...వరంగల్ నుండి వచ్చిన బండారి సుమన్ మాట్లాడుతూ 50 మందితో వచ్చాము ఈ సభలు చూస్తుంటే చాలా బాగున్నాయి., తెలుగు భాష పైన ప్రతి ఒక్కరు అవగాహనా పెంచుకోవాలి అంటూనే హైదరాబాద్ చాలా బాగుంది, ఇక్కడి వాతావరణం, ఆహరం, ఆతిధ్యం మరిచిపోలేనిది అని అన్నారు.