Skip to playerSkip to main contentSkip to footer
  • 12/18/2017
Modi wins Gujarat but BJP is likely to lose his hometown seat

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ విధంగా బీజేపీకి చేదును మిగిల్చాయి. కారణాలు ఏవైనా గతంలో కంటే సీట్లు తగ్గడం ఆ పార్టీ జీర్ణించుకోలేని విషయం. కుల సంఘ నాయకులు కలవడం వంటి కారణాల వల్ల బీజేపీ గతంలో కంటే తక్కువ సీట్లతో గట్టెక్కింది.పలు జిల్లాల్లో ఆయా నేతల ప్రభావం పడినట్లుగా కనిపిస్తోంది. బీజేపీ గెలుపును వారు అడ్డుకోలేకపోయినప్పటికీ ఓట్ల శాతాన్ని, సీట్లను మాత్రం తగ్గించగలిగారు. పాటీదార్, ఓబీసీ, దళిత నేతలు హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మేవానీలు బీజేపీని దెబ్బతీశారు.
గుజరాత్‌లో బీజేపీ అద్భుత విజయం సాధిస్తామని భావించింది. ఆ పార్టీ అధ్యక్షులు అమిత్ షా 150 సీట్లను టార్గెట్‌గా పెట్టుకున్నారు. కానీ వందకు పైగా సీట్లతో ఆగిపోయారు. అలాగే ఓట్ల శాతం కూడా తగ్గింది. పటీదార్, ఓబీసీ, దళిత్ ఉద్యమ నాయకులు కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపడం కూడా ముఖ్య కారణం.
అయినప్పటికీ ఓట్లు, సీట్లు తగ్గడంపై బీజేపీ పునరాలోచన చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భావి భారత్ కోసం మోడీ ఈ మూడేళ్లలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విపక్షాలు అరిచినా, గీపెట్టిన భారత్ ప్రపంచంలో నెంబర్ వన్ కావాలంటే సంస్కరణలు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి బలమైన నిర్ణయాలు తీసుకున్నారు.

Category

🗞
News

Recommended