Skip to playerSkip to main contentSkip to footer
  • 12/16/2017
The first picture of Anushka Sharma and Virat Kohli from their honeymoon after their marriage in Italy.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు సంబంధించిన హనీమూన్ సెల్ఫీ శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. డిసెంబర్ 11న ఇటీలీలోని టస్కానీలో పెళ్లి చేసుకున్న వీరిద్దిరూ ఆ తర్వాత హనీమూన్ కోసం రోమ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రోమ్‌లో ఉన్న ఈ జంట సెల్ఫీ దిగి అభిమానుల కోసం షేర్ చేశారు.
ఈ సెల్ఫీని అనుష్క శర్మ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. 'స్వర్గంలో ఉన్నట్లు ఉంది' అంటూ కామెంట్ పెట్టింది. అనుష్క తన ఫేస్ బుక్‌లో పోస్టు చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ ఫోటోకి కొన్ని లక్షల్లో లైక్‌లు వచ్చాయి. ఇక ఆ పిక్ లో అందరి దృష్టి అనుష్కకు విరాట్ ఇచ్చిన వెడ్డింగ్ గిఫ్ట్ పై పడింది. ఆ గిఫ్ట్‌ని సెలక్ట్ చేసుకునేందుకు విరాట్‌కు మూడు నెలల సమయం పట్టిందట. ఆ గిప్ట్ ఏంటో మనకూ తెలుసు కదా అరుదైన డైమండ్‌ పొదిగిన రింగ్. దానిని ప్రఖ్యాత ఆస్ట్రేలియన్ డిజైనర్ డిజైన్ చేశారు. ఇక ఆ రింగ్ చాలా అందంగా కనిపిస్తుంది కూడా ! అయితే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ హనీమూన్ పిక్ ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తుంది.

Category

🥇
Sports

Recommended