After the Superhit of “GunturTalkes”.. Producer M.Rajkumar produced few Entertainers like “Raja Meeru Keka” and “Pawanism 2”.. He is Now Making a different thriller with Popular heroines Anjali and Raai Lakshmi.
వెండితెరపై హాట్ హాట్ హీరోయిన్లు అంజలి గానీ, లేదా రాయ్ లక్ష్మీ సినిమాలంటే యూత్‌లో చెప్పలేనంత క్రేజ్. సోలోగా అంజలి సినిమా వచ్చినా గానీ, రాయ్ లక్ష్మీ మూవీ వచ్చినా గానీ భలే క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఇద్దరు హీరోయిన్లు కలిసి నటిస్తే సిల్వర్ స్క్రీన్ మీద రచ్చ రచ్చే. వీరిద్దరి కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారనే వార్త టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. రాయ్ లక్ష్మీ తాజా చిత్రం జూలీ2. ఈ చిత్రం ద్వారా ఆమె బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అయితే జూలీ2 చిత్రానికి పెద్దగా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ రాలేదు. అయితే రాయ్ లక్ష్మీ గ్లామర్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఇక అంజలి మధ గజరాజ, బెలూన్, కాలి చిత్రాల్లో నటిస్తున్నది. ఆమె నటించిన బెలూన్ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఇటీవల విడుదలైన బెలూన్ ఫస్ట్‌లుక్ మంచి స్పందన వచ్చింది. ఇలా వెండితెరపైన హాట్ హాట్‌గా నటిస్తున్న అంజలి, రాయ్ లక్ష్మీని ఆర్కే స్టూడియో బ్యానర్ కలిపింది. గుంటూరు టాకీస్, రాజా మీరు కేక లాంటి వినోదాత్మక చిత్రాలను ఆర్కే స్టూడియో బ్యానర్ నిర్మించింది. ప్రస్తుతం పవనిజం-2 చిత్రం , షూటింగ్ దశలో ఉన్నది.