Skip to playerSkip to main contentSkip to footer
  • 12/15/2017
WorldTeluguConference Hashtag trending in Twitter today. Traffic restrictions for World Telugu Conference in Hyderabad from 15 dec to 19 dec

ప్రపంచ తెలుగు సభల నిర్వహిస్తున్న నేపథ్యంలో #మనమాతృభాషతెలుగు అనే హ్యాష్‌ట్యాగ్‌.. ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతుండటం గమనార్హం. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు 2017 ప్రారంభ వేడుకలు శుక్రవారం సాయంత్రం 5గంటలకు వైభవంగా ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జరుగుతున్న తొలిసారి ప్రపంచ తెలుగు మహాసభలను కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే చేసింది. ప్రధాన వేదికతోపాటు హైదరాబాద్ మొత్తం ప్రముఖ కవులు, రచయితల హోర్డింగులు, కమాన్లతో తీర్చిదిద్ధింది. ఎల్పీ స్టేడియంతోపాటు మరో ఆరు వేదికల్లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. కాగా, సుమారు 6వేల మందికిపైగా అతిథులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. మహాసభల సందర్భంగా తెలుగు భాషా సదస్సులు, కవి సమ్మేళనాలు, చర్చా గోష్ఠులు, కథా సాహిత్యం, నవల, విమర్మ, గేయం, బాల, మహిళా సాహిత్యాలు, చరిత్ర, పరిశోధన, తెలుగు భాషపై విస్తృత చర్చలు జరుగుతాయి.

Category

🗞
News

Recommended