Skip to playerSkip to main contentSkip to footer
  • 12/15/2017
he man, Vikas Sachdeva who's working as senior executive in a private company is facing allegation of harassing the actress Zaira Wasim. Police registered a case under Section 354 of IPC u/s of POSCO Act and if proven guilty, which in all likelihood he will would be served a punishment of three to five years jail term.

'దంగల్', 'సీక్రెట్ సూపర్ స్టార్' చిత్రాల్లో నటించిన 17 సంవత్సరాల జైరా వాసిమ్ ఇటీవల విస్తారా విమానంలో ఢిల్లీ నుండి ముంబై వస్తూ లైంగిక వేధింపులకు గురైన సంగతి తెలిసిందే. ఓ ప్రైవేట్ కంపెనీలో సినియర్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న వికాస్ సచ్‌దేవా అనే వ్యక్తి ఈ నీచానికి పాల్పడ్డాడు.
తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి జైరా వాసిమ్ విమాన సిబ్బందికి చెప్పినా పట్టించుకోక పోవడం, తోటీ ప్రయాణీకులు కూడా స్పందించక పోవడంతో సోషల్ మీడియాలో అతడి వెకిలి చేష్టల గురించి గురించి ఆమె పోస్టు చేశారు. ఈ విషయం కొన్ని గంటల్లోనే వైరల్ అయి మహిళా కమీషన్ స్పందించే వరకు వెళ్లింది.
‘జైరా వాసిమ్' ఘటనతో విస్తారా ఎయిలైన్స్‌ను ఇబ్బందుల్లో పడేసింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. వెంటనే అతడిని అరెస్టు చేసి రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచారు. అతడిని కోర్టులో ప్రవేశ పెట్టగా డిసెంబర్ 22 వరకు జుడీషియల్ కస్టడీ విధించారు.
పోలీసులు వికాస్ సచ్‌దేవా మీద ఐపిసీ సెక్షన్ 354, పోస్కో యాక్ట్ కింద్ సెక్సువల్ హెరాస్మెంట్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో అతడిపై నేరం రుజువైతే దాదాపు 3 ఏళ్ల నుండి 5 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Recommended