Skip to playerSkip to main contentSkip to footer
  • 12/15/2017
YSRCP MLA Roja responded over Pawan Kalyan head shave issue.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఇటీవలి పర్యటనలో 'గుండు' వివాదంపై ఎట్టకేలకు నోరు విప్పడం రాష్ట్రంలో పెద్ద చర్చకే దారి తీసింది. పవన్ క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా గుండు వివాదాన్ని నిజమే అని నమ్ముతున్నవారూ లేకపోలేదు. అసలు నిజమేంటోనని జనం చెవులు కొరుక్కుంటున్నారు. అటు మీడియాలో, ఇటు జనంలో ఈ చర్చ కొనసాగుతుండగానే వైసీపీ ఎమ్మెల్యే రోజా మరో బాంబు పేల్చారు. ఓ టీవి చానెల్ తో మాట్లాడిన సందర్భంగా ఆమె పవన్ కళ్యాణ్ గుండు వివాదంపై స్పందించారు.

పవన్‌కు టీడీపీ గుండు కొట్టించిన మాట వాస్తవమేనని రోజా వ్యాఖ్యానించారు. ఆ సమయంలో తాను టీడీపీలోనే ఉన్నానని, కానీ ఆ సంఘటనతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పవన చెప్పిన తేదీలను బట్టి చూస్తే గుండు కొట్టించిన మాట నిజమేనని రోజా వ్యాఖ్యానించడం గమనార్హం.

Category

🗞
News

Recommended