mama o chandamama is the latest telugu movie. Ram Karthik, Sana Maqbul Khan are lead pair. This movie is set release on 15 December. In this occassion, Ram Karthik and Sana Maqbul Khan speak to media and revealed highlights of the movie.
యంగ్ హీరో రామ్ కార్తీక్ హీరోగా సనా మక్బూల్ ఖాన్ హీరోయిన్‌గా ఈస్ట్ వెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విశాఖ థ్రిల్లర్స్ వెంకట్ దర్శకత్వంలో వరప్రసాద్ బొడ్డు నిర్మించిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మామ ఓ చందమామ'. మున్నా కాశీ సంగీతం సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోకి, ట్రైలర్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు సర్టిఫికెట్‌తో డిసెంబర్ 15న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో రామ్ కార్తీక్, హీరోయిన్ సనా మక్బూల్ ఖాన్ పాల్గొన్నారు. హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ - ''ఈస్ట్ వెస్ట్ ఎంటర్‌టైనర్స్ బేనర్‌లో తొలి ప్రయత్నంగా 'మామ ఓ చందమామ' చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు విశాఖ ధ్రిల్లర్స్ వెంకట్ బేసిగ్గా నృత్య దర్శకుడైనా సినిమాని ఎంతో ప్రేమించి అద్భుతమైన సినిమాని తెరకెక్కించాడు అని తెలిపారు. మామ ఓ చందమామ చిత్రంలో చంటి క్యారెక్టర్‌లో నటించాను. విలేజ్‌లో ప్రతి ఒక్కరికీ చేదోడు వాదోడుగా వుంటూ అందర్నీ ప్రేమించి.. అందరి ప్రేమ పొందుతూ చాలా సరదాగా వుండే కుర్రాడి క్యారెక్టర్‌లో నటించాను. కామెడీ, లవ్, ఎమోషన్స్ అన్నీ ఈ చిత్రంలో వున్నాయి. అందరికీ నచ్చే ఒక మంచి సినిమా చేసాం అని రామ్ కార్తీక్ అన్నారు. టీమ్ అంతా కలిసి ఒక ఆహ్లాదకరమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాం. ఈ డిసెంబర్ 15న 15 చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అన్ని చిత్రాలు ఆడాలి. అందులో మా చిత్రాన్ని కూడా ఆదరించాలి'' అన్నారు.