Skip to playerSkip to main contentSkip to footer
  • 12/14/2017
Ernakulam chief judicial magistrate court pronounces sentence for convict Ameerul Islam in Jisha case.

కేరళ లా విద్యార్థిని హత్య, రేప్ కేసులో నిందితుడు అమీరుల్ ఇస్లాంకు ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్ కోర్టు మరణ దండన విధించింది. ఇప్పటికే అతన్ని దోషిగా నిర్ధారించిన కోర్టు గురువారం శిక్షను ఖరారు చేసింది.
లా విద్యార్థిని జిషా నిరుడు ఏప్రిల్ 28వ తేదీన శవమైన తేలిన విషయం తెలిసిందే. అమీరుల్ ఇస్లాం అస్సాం నుంచి వలస వచ్చిన కూలీ. నిరుడు కేరళలో 30 ఏళ్ల దళిత లా విద్యార్థినిపై అత్యాచారం జరగడమే కాకుండా ఆమె కిరాతకంగా హత్యకు గురైంది. ఈ కేసులో అమీరుల్ ఇస్లాం ఒక్కడే నిందితుడు.
దళిత విద్యార్థిని శవం 2016 ఏప్రిల్‌లో రక్తం మడుగులో పడి ఉంది. హత్య గురించి ఇరుగుపొరుగువారికి ఏ విధమైన ఆనవాళ్లు కూడా దొరకలేదు. అరుపులు కూడా వారికి వినిపించలేదు. అమీరుల్ ఇస్లాం అత్యాచారం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో పదునైన ఆయుధంతో చంపేశాడు. ఆమె శవం కనిపించిన 50 రోజుల తర్వాత పోలీసులకు అమీరుల్ ఇస్లాం పట్టుబడ్డాడు.

Category

🗞
News

Recommended