Gujarat Elections Updates : Polling underway for Phase-II రెండో దశ ఎన్నికల పోలింగ్ | oneindia

  • 7 years ago
Voting for the second phase of the Gujarat elections began at 8 am today, BJP President Amit Shah,PM Modi’s mother Heeraben were among first voters cast their votes

గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు గురువారం(డిసెంబర్ 14న) ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 182స్థానాలకు గానూ తొలి దశలో 89 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగగా.. రెండో దశలో 14జిల్లాలోని 93 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరగుతోంది. ఉత్తర, పశ్చిమ, సెంట్రల్ గుజరాత్‌లలో పోలింగ్ జరగుతోంది. - తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ వాద్‌నగర్ సమీపంలోని ఓ గ్రామ ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. - ఉదయం 9.10గంటల ప్రాంతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన ఓటు హక్కును నారాయణపురాలో వినియోగించుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్ పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పటేళ్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ తల్లిదండ్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 9గంటల వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

Recommended