ఉమా మాధవ రెడ్డి @TRS : దానికే స్కెచ్, టీడీపీతో కటిఫ్ !

  • 6 years ago
Uma Madhava Reddy Along with her son Sandeep Reddy is all set to join TRS. Sandeep is going to join the TRS on Dec 14 in the presence of TRS supremo and CM KCR.

గురువారం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన తెలంగాణ టీడీపీ సీనియర్ నాయకురాలు ఎలిమినేటి ఉమా మాధవ రెడ్డి అసలు పార్టీ మారాలని ఆరు నెలల క్రితమే నిర్ణయానికి వచ్చారు. ఇదే అంశంపై టీడీపీలోని తన అభిమానులు, అనుచరులతో పదేపదే చర్చించారని తెలుస్తున్నది. తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసమే ఆమె టీఆర్ఎస్ పార్టీలోకి చేరారన్నది స్పష్టంగానే తెలుస్తున్నది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత నానాటికి దిగజారుతున్న టీడీపీ ప్రతిష్టకు తోడు జిల్లా పార్టీలో గ్రూపుల గోల తదితర అంశాలతో టీడీపీకి గుడ్ బై చెప్పేయాలని ఆమె నిర్ణయించుకున్నారు.
టీడీపీ వ్యవస్థాపక నేతల్లో ఒకరిగా ఎలిమినేటి మాధవ రెడ్డి ఇటు పార్టీకి, అటు రాష్ట్రానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తొలి నుంచి ఉమా మాధవరెడ్డికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పొలిట్ బ్యూరోలో చోటు కల్పించారు. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత పార్టీ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మారిన రాజకీయాల నేపథ్యంలో టీడీపీ నుంచి ఉమా మాధవరెడ్డి, ఆమె తనయుడు అధికార టీఆర్ఎస్‌లో చేరడానికి ముహూర్తం ఖరారు కావడంతో దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు తెదేపాతో ఉన్న ఆమె కుటుంబ అనుబంధానికి తెరపడనుంది.

Recommended