Skip to playerSkip to main contentSkip to footer
  • 12/11/2017
"I don't need security.I used the 'I' as an example to indicate that whistle-blowers don't have support from the ecosystem.Putting an end to this confusion once n for all.I have nothing to REVEAL.Plz leave me alone abt this.

కౌస్టింగ్ కౌచ్.... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా పరిశ్రమల్లో పలువురు నటీమణులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. చాలా సంవత్సరాల నుండి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా... హాలీవుడ్లో హార్వీ వెయిన్‌స్టన్ వ్యవహారం తర్వాత ఈ విషయంంలో అందరిలోనూ చైతన్యం వచ్చింది. వివిధ సినీ పరిశ్రమల్లో హీరోయిన్లు, నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల సంఘటనల గురించి వెల్లడిస్తున్నారు. ఇటీవల కౌస్టింగ్ కౌచ్ అంశంపై బాలీవుడ్ నటి రీచా చద్దా స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రీచా చద్దా స్పందిస్తూ తనతో పాటు, తన కొలీగ్స్ ఎంతో మంది లైంగిక వేధింపులకు గురయ్యారని, రక్షణ కల్పిస్తామన్న హామీ వస్తే, హార్వే వీన్ స్టెయిన్ ఘాతుకాల వంటివి ఎన్నో బయటకు వస్తాయని తెలిపారు.
రిచా చద్దా ఆ వ్యాఖ్యలు చేసినప్పటి నుండి ఆమెపై ఒత్తిడి పెరిగింది. మీకు రక్షణ కల్పిస్తాం, వారి పేర్లు బయట పెట్టాలని ఆమెకు ఫోన్లు, సందేశాలు వస్తుండటంతో.... ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చుకున్నారు.
నాకు ఏ రక్షణ అవసరం లేదు. 'నేను' అన్న పదాన్ని ఓ ఉదాహరణగా మాత్రమే ఇంటర్వ్యూలో వాడాను. ఇక ఈ అయోమయానికి స్వస్తి పలకండి. చెప్పుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి.... అంటూ రీచా చద్దా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Recommended