Skip to playerSkip to main contentSkip to footer
  • 12/11/2017
Anchor Ravi Gets Emotional about his Profession in Idi Maa Prema Katha Movie Latest Interview. I do not know how to do another job except films and tv shows.

ఇప్పటి వరకు ఇండస్ట్రీలో యాంకర్‌గా, ప్రోగ్రామ్ హోస్ట్ గా రాణించిన యాంకర్ రవి 'ఇది మా ప్రేమకథ' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి సినిమా ఇండస్ట్రీ వైపు తన జర్నీ ఎలా సాగిందో వెల్లడిచారు.
నాకు ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేదని, చిన్నప్పటి నుండి చిరంజీవి, రజనీకాంత్, నాగార్జున లాంటి హీరోల సినిమాలు చూస్తూ పెరిగానని, వారిలాగా అవ్వాలని ఉండేది. డైరెక్టుగా సినిమాల్లోకి వచ్చే పరిస్థితి లేదుకాబట్టి ముందుగా యాంకరింగ్ మొదలు పెట్టినట్లు రవి తెలిపారు.
నాలుగైదు సంవత్సరాలు యాంకరింగ్ చేసిన తర్వాత సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అపుడు పెద్ద సినిమాల్లో తమ్ముడు క్యారెక్టర్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లాంటివి వచ్చేవి. అయితే పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెళ్లాలా? చిన్న సినిమాల్లో హీరోగానా? అనే అయోమయం ఉండేదని తెలిపారు.

Recommended