Skip to playerSkip to main contentSkip to footer
  • 12/11/2017
It was an bad start to Rohit Sharma's India captaincy as the home team was out for 112 in 38 overs, a target which the sri lanka crossed in 20.4 overs.

ధ‌ర్మ‌శాల వేదిక‌గా శ్రీలంక‌, భార‌త్‌ల మ‌ధ్య జ‌రిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియాపై శ్రీలంక భారీ విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 112 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు నష్టపోయి 20.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెన‌ర్‌గా దిగి డ‌కౌట్ అయిన శిఖ‌ర్ ధావ‌న్‌తో మొద‌లై కుల్‌దీప్ యాద‌వ్ వర‌కు ఔట్ల ప‌రంప‌ర సాగింది. వ‌రుస‌గా రాలిపోతున్న వికెట్ల‌ను కుల్‌దీప్ యాద‌వ్ కొంత వ‌ర‌కు ఆపి 19 స్కోరు సాధించాడు. మిగిలిన బ్యాట్స్‌మన్ మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఒక్క‌డే క్రీజులో నిల‌బ‌డి 100వ‌ర‌కు కూడా వెళ్ల‌దు అనుకున్న స్కోరును 112 వ‌ర‌కు తీసుకెళ్లాడు. జ‌స్ప్రిత్ బుమ్రా, ధోనీకి మంచి భాగ‌స్వామ్యాన్ని అందించాడు. 87 బంతుల్లో 65ప‌రుగులను చేసి ఎలాగైతే టీమిండియాను వంద దాటించాడు.
ఇక శ్రీలంక‌ ఆటగాళ్ళు రెచ్చిపోయి ఆడారు. సురంగ ల‌క్మ‌ల్ ప‌ది ఓవ‌ర్ల బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు తీశాడు. నువాన్ ప్ర‌దీప్ రెండు వికెట్లు తీయ‌గా మిగిలిన న‌లుగురు ఒక్కొక్క‌టి చొప్పున తీశారు. టెస్ట్ సిరీస్ ప‌రాజ‌యం త‌ర్వాత శ్రీలంక టీం మంచి దూకుడుతోనే వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే అంతకుముందు ప్రాక్టీస్ సెష‌న్ ముగియ‌గానే లంక క్రికెటర్లు ద‌లైలామాను క‌ల‌వ‌డానికి వెళ్లారు. హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో ద‌లైలామా ఉండే ప్రాంతం ధ‌ర్మ‌శాలకు ద‌గ్గరే. ఈ విష‌య‌మై లంక క్రికెట‌ర్లపై అభిమానులు సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున చుర‌కలు అంటించారు. 'టెస్ట్ సిరీస్ గెల‌వలేక‌పోవ‌డంతో ఇప్పుడు వ‌న్డే పై భ‌యం ప‌ట్టుకుంది. అందుకే ఆశీర్వాదానికై బ‌య‌ల్దేరారు. ఒక్క మ్యాచ్‌ అయినా గెలిచేలా దీవించాలని గురువును కోరుకున్నారేమో' అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలు వెల్లడించారు. క్రిందటి వారం ముగిసిన భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్ లో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే.

Category

🥇
Sports

Recommended