Skip to playerSkip to main contentSkip to footer
  • 12/9/2017
Without captain Kohli, a formidable batting line-up comprising Rohit, Rahane, Dinesh Karthik, MS Dhoni, Kedar Jadhav could prove too hot to handle for the islanders.

భారత్‌-శ్రీలంకల మధ్య తొలి వన్డే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ధర్మశాలలో జరగనుంది. రేపటి నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానున్న నేప‌థ్యంలో ఇది తొలి మ్య‌చ్‌. ఈ వన్డే కోసం ఇరు జట్లు ఇప్పటికే ధర్మశాలకు చేరుకున్నాయి. టెస్టు సిరిస్‌ను 1-0తో కైవసం చేసుకున్న భారత్ ఇప్పుడు వన్డే సిరిస్‌ను కూడా కైవసం చేసుకోవాలని ఊవిళ్లూరుతోంది. అయితే టెస్టు సిరిస్‌ను 1 - 0 తో గెలిచినందుకు ప్రతీకారంగా వన్డే సిరీస్ ని క్లీన్ స్వీప్ చెయ్యాలన్న కసితో భారత్ ఉంది. కానీ కొంతమంది ఫాం పై మాజీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలే ఈ సిరీస్ కి కోహ్లి కెప్టెన్ గా లేడు. ఇక రహనే లాంటి ఆటగాళ్ళు నిలకడ లేమితో బాధపడుతున్నారు. మరి వన్డే సిరీస్ ఎవరికి దక్కుతుందో అనేది కొంచెం సస్పెన్స్ గానే ఉంది. ఇక మరోపక్క అనేక కారణాలతో, లక్ తో వైట్ వాష్ తపించుకున్న లంక ఈసారి కూడా వైట్ వాష్ కాకుండా ఉండటానికి సతవిదాలా ప్రయత్నిస్తుంది. సిరీస్ గెలవడం అంటే అది చాలా కష్టతరమైన పని అని లంక కు కూడా తెలుసు. అందుకే కనీసం వైట్ వాష్ తప్పించుకోవాలని చూస్తుంది.

Category

🥇
Sports

Recommended