Bubbly heroine Hansika has never been vocal about her love life, even when rumours about her and Tamil hero Simbu were doing rounds. She had opened up about her breakup in an interview.
తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ స్టార్ హన్సిక మోత్వాని. అయితే ఆమె గురించి వార్తలు కూడా హాట్ హాట్‌గా ఉంటాయి. పలువురు కోలీవుడ్ హీరోలతో ఆమెకు అఫైర్లు ఉన్నాయనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. శింబు, జయం రవి, సిద్ధార్థ్‌తో అఫైర్ వార్తలు మీడియాలో షికారు చేశాయి. అయితే తాజాగా ఓ యువ నటుడితో పీకల్లోతు ప్రేమలో పడినట్టు ఓ రూమర్ వైరల్‌గా మారింది. ఈ ఏడాది ఆరంభంలో శింబుతో హన్సిక ప్రేమలో పడింది అనే వార్తలు మీడియాలో ప్రముఖంగా కనిపించాయి. ఆ తర్వాత వెంటనే శింబుతో బ్రేకప్ వార్తలు వచ్చాయి. మరో తమిళ హీరో జయం రవితో హన్సికకు అఫైర్ ఉంది అనే వార్త బయటకు వచ్చింది. వారిద్దరు కలిసి ఎంగేయమ్ కాదల్, రోమియో జూలియట్ అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలో వారి మధ్య అఫైర్ చోటుచేసుకొన్నదని ఆ వార్తల సారాంశం.