Skip to playerSkip to main contentSkip to footer
  • 12/9/2017
Actor Sumanth gets request from CM’s residence for print of ‘Malli Raava’

టాలీవుడ్ లో ఏదైనా మంచి సినిమా వచ్చిందీ అంటే ఒకప్పుడైతే దాసరి గారు టీమ్ మొత్తాన్నీ ఆయన ఆఫీసుకో, ఇంటికో పిలిచేవారు, సినిమా ప్రమోషన్ కోసం తనవంతు ప్రయత్నమూ చేసేవారు. పొలిటీషియన్లు పెద్దగా సినిమాని పట్టించుకోని కాలం లో అలా చిన్న సినిమా బావుందీ అంటే దాన్ని ప్రోత్సహించే పనులు చేయటంలో కేసీఆర్ ఉంటున్నారు.
రీసెంట్ రిలీజ్ మళ్లీ రావా మూవీపై కూడా కేసీఆర్ రియాక్ట్ అయ్యారట. కాకపోతే ఆయన నేరుగా ఈ సినిమా గురించి చెప్పలేదు కానీ.. మళ్లీ రావా ఫీల్ గుడ్ మూవీ అనే విషయం తెలిసిన కేసీఆర్.. ఈ సినిమాను ఓ ప్రింట్ పంపించమని చెప్పారట. నేరుగా హీరో సుమంత్ ఇంటికే ఫోన్ చేశారట తెలంగాణ సీఎం.
ముఖ్యమంత్రి ఇంటి నుంచి తన సినిమా గురించి ఫోన్ రావడం.. చూడాలని కోరుకుంటున్న సంగతి చెప్పడంతో సంతోషించేశాడట ఈ అక్కినేని హీరో. కేసీఆర్ అడిగిన మేరకు.. వెంటనే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నాడు సుమంత్.

Recommended