Skip to playerSkip to main contentSkip to footer
  • 12/9/2017
Film Nagar source said that, Thaman lost the opportunity to compose tunes for Megastar Chiranjeevi's much-anticipated upcoming high-budget movie Sye Raa Narasimha Reddy.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సైరా నరసింహా రెడ్డి' సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమా అఫీషియల్‌గా ప్రకటించిన తర్వాత మెయిన్ టెక్నీషియన్స్ విషయంలో చాలా మార్పులు జరిగాయి. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా మొదట రవివర్మన్‌ను అనుకున్నారు. అయితే పలు కారణాలతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో రత్నవేలు వచ్చారు. 'సైరా'కు సంగీతం అందించేది ఏఆర్ రెహమాన్ అని మొదట ప్రకటించినప్పటికీ వేరే కమిట్మెంట్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ తాను చేయలేక పోతున్నాను అని రెహమాన్ స్వయంగా తెలిపారు.
రెహమాన్ స్థానంలో ‘సైరా' ప్రాజెక్టులోకి తమన్ వచ్చే అవవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ‘సైరా' మోషన్ పోస్టర్ కు తమన్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించడంతో ఇది నిజమే అని అంతా అనుకున్నారు. అయితే తమన్ సంగీతం అందించే అవకాశం లేదని తాజా సమాచారం.

Recommended