Skip to playerSkip to main contentSkip to footer
  • 12/8/2017
The order of the astrological signs is Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces. ... In Western and Indian astrology, the emphasis is on space, and the movement of the Sun, Moon and planets in the sky through each of the zodiac signs.

తలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 9 వ తేదీ శనివారం 2017 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. బహుళ షష్టి ఉదయం 8 గంటల 57 నిమిషముల వరకు వుంది. మఖ నక్షత్రం 11 గంటల 5౦ నిమిషముల వరకు వుంది. అమృత సమయం ,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారు భూ సంబంధ విషయాలు ఓ కొలిక్కి వస్తాయి..అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి వారు ఇంటి పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంటి సౌఖ్యం చూస్తారు. తల్లి గారితో ఆనందంగా గడుపుతారు. భార్య సహకారం వుంటుంది. మిధున రాశి వారికి ధన ఇబ్బందులున్నాయి. తలచిన పనులు ఆలస్యంగా జరుగుతాయి. కర్కాటక రాశి వారు ధన ప్రణాలికలు వేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి. సింహ రాశి వారు తలచిన పనులు సవ్యంగా సాగుతాయి. మనసుకు ఆనందంగా వుంటుంది. కన్య రాశి వారు భూ సంబంధ లావాదేవీలు అనుకూలిస్తాయి. ఇంటి విషయాల యందు శ్రద్ద వహించి పూర్తి చేస్తారు. తుల రాశి వారికి ఈ రోజు ఆనందంగా గడుస్తుంది. అవసరానికి డబ్బు చేకూరుతుంది. సోదరుల విషయం లో జాగ్రత్త వహించండి. వృశ్చిక రాశి వారు ఆలోచనలు ఎక్కువ చేస్తారు. దానానికి ఇబ్బంది కలదు. ధనూ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. అవసరాలకు అప్పులు చేయవలసి వస్తుంది. తండ్రి గారి ఆశీర్వాదం వల్ల మంచి జరుగుతుంది.. మకర రాశి వారు తలచిన పనులు ఆలస్యంగా జరుగుతాయి. అవకాశాలు చేజారే అవకాశం వుంది. కుంబ రాశి వారికి శరీర శ్రమ వుంటుంది.భార్య సహకారం వుంటుంది. మీన రాశి వారు కలహాలకు తావు ఇవ్వకండి. ఆర్ధిక పరమైన చిక్కులున్నాయి.వృత్తి వ్యాపారాలు విషయం లో శ్రమ పడవలసి వుంటుంది.

Category

🗞
News

Recommended