Nagarjuna Gives Clarity On Hello Teaser Removed From Youtube. "This was a just miss communication." He said.
అఖిల్ అక్కినేని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'హలో'. ఈ చిత్రం ద్వారా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. నాగార్జున నిర్మాత. కొన్ని రోజుల క్రితం 'హలో' టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే కాపీరైట్ ఇష్యూ రావడంతో యూట్యూబ్ దీన్ని కొన్ని గంటల పాటు డీయాక్టివేట్ చేసింది. ఈ టీజర్లో కాపీ కొట్టిన ట్రాక్స్ వాడటం వల్లే ఇలా జరిగిందంటూ ఆ మధ్య చిన్నపాటి వివాదం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై 'హలో' ప్రెస్‌మీట్‌లో నాగార్జున స్పందించారు. ఫస్ట్ టీజర్ యూట్యూబ్ వారు తీసేసిన మాట నిజమే. ఇపుడు చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మోస్ట్ ఆఫ్ ది టీజర్స్ డైరెక్టర్స్ కట్ చేయడం లేదు. డైరెక్టర్లు సినిమా ఎడిటింగులో బిజీగా ఉంటారు. టీజర్ ఎడిటర్స్ అని ప్రత్యేకంగా ఉన్నారు. హలో టీజర్ బాంబేలో ఎడిట్ కావడం వల్లే ఇదంతా జరిగింది అని నాగార్జున తెలిపారు. ‘హలో' టీజర్ ఎడిట్ అయినపుడు వాళ్లు కొన్ని సౌండ్ ట్రాక్స్ వేశారు. ఆన్ లైన్లో చాలా సౌండ్ ట్రాక్స్ ఉంటాయి. మనకు నచ్చితే కొనుక్కోవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అప్పుడప్పుడు తమ సినిమాల్లో ఇలాంటివి డతారు. అలా ‘హలో' టీజర్ కోసం కొన్ని ట్రాక్స్ తీసుకున్నాం. వాటిని ‘హలో' మ్యూజిక్ తో కలపడం జరిగిందని నాగార్జున తెలిపారు.