Skip to playerSkip to main contentSkip to footer
  • 12/6/2017
Mega Star Chiranjeevi’s most prestigious project, ‘Sye Raa Narasimha Reddy’, kicks off today in Hyderabad. Directed by Surender Reddy, Chiranjeevi will be seen applying the titular role in the period film which is based freedom fighters of India, Uyyalawada Narasimha Reddy.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఈ సినిమా షూటింగ్ బుధవారం (డిసెంబర్ 6) హైదరాబాద్‌ శివారులో వేసిన ప్రత్యేక సెట్లో మొదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం చిరంజీవి కోరీర్లోనే భారీ బడ్జెట్‌ మూవీ. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
షూటింగ్ మొదలైన విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు సురేందర్ రెడ్డి సెట్స్‌ నుండి కొన్ని ఫోటోలు విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉందని, అమేజింగ్ టీమ్‌తో కలిసి పని చేస్తున్నానని సురేందర్ రెడ్డి తెలిపారు. లొకేషన్లో చిత్ర నిర్మాత రామ్ చరణ్ తో కలిసి సెల్ఫీ పోస్టు చేశారు.
సెట్స్‌లో చిన్నపాటి పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కొణిదెల ప్రొడక్షన్స్ విడుదల చేసింది.

Recommended