Skip to playerSkip to main contentSkip to footer
  • 12/6/2017
The common man in Ahmedabad expressing their Unhappy over BJP ruling, street vendors and somany small business owners are feeling the same.

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. బీజేపీ తీసుకొచ్చిన జీఎస్టీ, డిజిటల్ చెల్లింపులు, ఆధార్ కార్డు లింకు వంటి విధానాలు సాధారణ వ్యాపారులను గందరగోళపరుస్తున్నాయి. ఈ విధానాలు తమ వ్యాపారాలకు తీవ్ర ప్రతిబంధకంగా మారడంతో అక్కడి వ్యాపారులు బీజేపీపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉండటంతో.. సహజంగానే ఆ వ్యతిరేకత కూడా కొంత తోడైంది.
బీజేపీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన ఆర్థిక విధానాలు గుజరాత్ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయంటున్నారు. అహ్మదాబాద్ స్థానికుల మాటల్లోనూ ఇదే వ్యక్తమవుతోంది. కూరగాయాల రేట్లు పెరిగిపోయాయి, గ్యాస్ ధర రూ.700 దాటింది, కరెంటు బిల్లులు పెరిగిపోయాయి.. జీఎస్టీ దెబ్బకు వచ్చే సంపాదన కూడా కుటుంబ పోషణకు సరిపోవడం లేదని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. ఒకరకంగా ఎంత కష్టపడ్డా ఏమి మిగలని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు.

Category

🗞
News

Recommended