Pawan kalyan latest movie is Agnathavasi. This film is getting ready for Sankrathi festival. After this movie. This movie going to release in highest locations in US.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటేనే పిచ్చా క్రేజ్ ఉంటుంది. జల్సా, అత్తారింటికి దారేది ఘన విజయాల తర్వాత దర్శకుడు త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే కిర్రాకే. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న అజ్ఞాతవాసి చిత్రం రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తున్నది. అమెరికాలో ఈ చిత్రం కాబోయే థియేటర్ల సంఖ్య గురించి ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. పవన్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న అజ్ఞాతవాసి చిత్రానికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను భారీగా స్థాయిలో విడుదల చేయాలని చిత్ర నిర్మాత రాధాకృష్ణ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నట్టు సమాచంర. పవన్ సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో విదేశాల్లో ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం అమెరికాలోని 209 ప్రాంతాల్లో అజ్ఞాతవాసిని విడుదల చేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం.అమెరికాలో ఈ రేంజ్‌లో పవన్ సినిమా రిలీజ్ కావడం ఇదే మొదటిసారి.