Skip to playerSkip to main contentSkip to footer
  • 12/4/2017
Osmani University student committed lost life on Sunday in Hostel room.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి మురళి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. చాన్నాళ్ల తర్వాత ఆదివారం వర్సిటీలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరుద్యోగం కారణంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు చెప్పారు. మురళి సోదరుడు, తల్లి ఓయుకు వచ్చారు. కొడుకు మృతదేహాన్ని చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరు అయ్యారు. ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం విద్యార్థి మురళి మానేరు హాస్టల్‌లోని రూమ్‌నెంబరు 159లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలియడంతో విద్యార్థులు, తెలంగాణ జేఏసీ నేతలు ఘటనాస్థలికి చేరుకున్నారు. మురళి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మానేరు హాస్టల్ గదికి వెళ్లిన పోలీసులను విద్యార్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది
మురళి మృతదేహాన్ని తీసుకెళ్లకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. నిరుద్యోగం కారణంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడని మండిపడ్డారు. అతని కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Category

🗞
News

Recommended