US seeks India help to do more on North Korea | Oneindia Telugu

  • 6 years ago
North Korea a "global harm", the US said today that it expects India to do more to help America.

వరుస క్షిపణుల ప్రయోగాలతో ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న ఉత్తరకొరియాపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు అమెరికా హెచ్చరికలు చేస్తున్నా.. అవేం పట్టనట్లు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. తాము యుద్ధానికి సిద్ధమంటూ సంకేతాలు పంపుతూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా.. ప్రపంచ ముప్పుగా పరిణమించిందని ఆ దేశంపై ఒత్తిడి చేసేందుకు భారత్‌ సాయం చేయాలని అగ్రరాజ్యం అమెరికా కోరింది. ప్యాంగ్యాంగ్‌ ఖండాంతర అణు క్షిపణుల ప్రయోగాలు చేపట్టకుండా అడ్డుకట్ట వేసేందుకు మిత్రదేశాలు ముందుకు రావాలని అమెరికా పిలుపునిచ్చింది.
ఉత్తర కొరియా బుధవారం హ్వాసంగ్‌-15 ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇది వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి జపాన్‌ సముద్ర జలాల్లో పడినట్టు సమాచారం. ఈ అణు క్షిపణి దాదాపు 13,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని విశ్లేషకులు అంటున్నారు. అమెరికాలోని ఏ భాగానైన్నా తాకగలదని భావిస్తున్నారు.

Recommended