Theater cafe was set up in Apollo Foundation Theater premises. Chiru's filter coffee available here. "Hey come relax & rejuvenate at ApolloFND theatre near the exit gate of HospitalsApollo Hyderabad - cafe opens 2pm today." Upasana tweeted.
మెగా స్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో వైస్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించడంతో పాటు వివిధ వ్యాపారాలు చేస్తూ దూసుకెళుతున్నారు. తాజాగా ఆమె ఓ కాఫీ షాప్ ప్రారంభించారు. ఈ కేఫ్ లో మామయ్య చిరంజీవి పేరుతో స్పెషల్ డ్రింక్ ఏర్పాటు చేయడం విశేషం. ఈ కాఫీ షాపుకు ‘థియేటర్ కేఫ్' అని పేరు పెట్టారు. అపోలో ఫౌండేషన్ థియేటర్ ప్రాంగణంలో దీన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు దీన్ని ప్రారంభించడానికి ముహూర్తం పెట్టినట్లు ఉపాసన తెలిపారు. జూబ్లీహిల్స్ లోని అపోలో ఫౌండేషన్ థియేటర్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ఉపాసన ప్రారంభించిన ఈ కాఫీ షాప్ మెనూలో చిరుస్ ఫిల్టర్ కాఫీ పేరుతో స్పెషల్ డ్రింక్ కూడా చేర్చారు. దీని ధర కేవలం రూ. 20 మాత్రమే.