అఖిల్‌తో గొడవలు ఇష్టం లేకే.. నాని ఇలా చేసాడా ?

  • 7 years ago
Ever since team MCA (Middle Class Abbayi) confirmed the release date to December 21 movie lovers have been treating it as a fight between Natural Star Nani and Akhil for Christmas season.

నాని హీరోగా నటిస్తున్న 'ఎంసీఏ-మిడిల్ క్లాస్ అబ్బాయి' చిత్రం డిసెంబర్ 21న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు బేనర్ నుండి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. నాని సినిమా విడుదలైన మరుసటి రోజు డిసెంబర్ 22న అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'హలో' మూవీ విడుదలవ్వబోతోంది. ఈ నేపథ్యంలో నాని, అఖిల్ మధ్య బాక్సాఫీస్ వార్ అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.
వార్ అఖిల్‌తో కాదని సల్మాన్‌ ఖాన్‌తో అని నాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘టైగర్‌ జిందా హై' చిత్రం కూడా డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘యుద్ధం నాకు అఖిల్‌కి మధ్య కాదు.. సల్మాన్‌ ఖాన్‌తో. ఈ క్రిస్మస్‌కు ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి'.. ‘టైగర్‌'కు ‘హలో' చెబుతాడు. అది తెలుగు సినిమాపవర్‌ అంటూ నాని ట్వీట్‌ చేశారు.
అఖిల్‌తో నానికి మంచి స్నేహం ఉంది. తమ మధ్య ఏదో యుద్ద వాతావరణం నెలకొన్నట్లు వార్తలు రావడం ఇష్టం లేకనే నాని ఇలా స్పందించినట్లు తెలుస్తోంది.

Recommended