ప్రభాస్‌ను రిజెక్ట్ చేసిందట..!

  • 7 years ago
When Shraddha Kapoor got finalised for Prabhas’ Saaho, everyone was under the impression that she has replaced Anushka Shetty and that Anushka was the initial choice for the film.

బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ పక్కన నటించడానికి అవకాశం వస్తే ఎంత బాగుంటుందో అని చాలా మంది కుర్ర హీరోయిన్లు ఆశపడ్డారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే బాహుబలి2 తర్వాత దేశవ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ ఆ రేంజ్‌లో పెరిగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో సాహోలో నా పాత్ర లెంగ్త్ బాగాలేదని ప్రభాస్ పక్కన నటించడానికి ఓ హీరోయిన్ ఒప్పుకోలేదట. ఈ ఆసక్తికరమైన అంశం తాజాగా మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..
సాహోలో హీరోయిన్‌ కోసం బాలీవుడ్ అందాల తార ఆలియా భట్‌ను తొలుత సంప్రదించారుట. ఆలియాకు అవకాశం రావడంతో ఆమె గురువు కరణ్ జోహర్ కూడా చాలా సంతోషపడినారట. ప్రభాస్ పక్కన నటించేలా ఆలియాను ఒప్పించడానికి తెగ ప్రయత్నించారట. అయితే గురువు కరణ్ కూడా కాదని సాహో చిత్రాన్ని రిజెక్ట్ చేశారట.
ప్రభాస్ పక్కన నటించవద్దని ఆలియా భట్ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. ప్రభాస్‌తో సమానంగా సీన్లు లేకపోవడమేనట.
బాలీవుడ్‌లో మంచి పాత్రలతో పేరు తెచ్చుకొంటున్న నేపథ్యంలో దక్షిణాది ఎంట్రీ అదిరిపోవాలనే ఉద్దేశంతో ఆలియా ఈ నిర్ణయం తీసుకొన్నదట.
సాహోను వదులుకొన్నప్పటికీ.. ఇప్పటికీ సౌత్‌లో తనకు నచ్చిన హీరో ప్రభాస్ అని ఆలియా భట్ ఇటీవల చెప్పింది. ప్రభాస్‌తో నటించే అవకాశాన్ని వదులుకోవడం బాధగానే ఉంది. కానీ మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. మళ్లీ ప్రభాస్‌తో అవకాశం వస్తే వదులుకోను అని ఆలియా ట్విట్టర్ చాట్‌లో పేర్కొనడం గమనార్హం.

Recommended